Andhra Pradesh: టీడీపీ నాయకురాలు యామినిపై వైసీపీ ఫిర్యాదు

  • సీఎం జగన్ ని కించపరుస్తూ పోస్ట్ చేశారని ఆరోపణ
  • గుంటూరులోని పట్టాభిపురం పీఎస్ లో ఫిర్యాదు
  • యామిని తీరు మార్చుకోకపోతే తగిన బుద్ధి చెబుతాం: వైసీపీ నాయకురాలు ఝాన్సీ

టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మపై వైసీపీ మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఎం జగన్ ని కించపరుస్తూ ఫేస్ బుక్ పోస్ట్ చేశారని ఆరోపిస్తూ గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో వైసీపీ నాయకురాలు ఝాన్సీ మాట్లాడుతూ, యామిని తన తీరు మార్చుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మరోపక్క, సామాజిక మాధ్యమాల వేదికగా తన పేరిట ఫేక్ పోస్టింగ్స్ వస్తున్నాయంటూ సాధినేని యామిని ఏపీ పోలీసులకు ఈరోజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. యామినేని పిర్యాదు చేసిన కొన్ని గంటలకే వైసీపీ మహిళా విభాగం ఆమెపై ఫిర్యాదు చేయడం గమనార్హం.

Andhra Pradesh
Telugudesam
YSRCP
yamini
jhansi
  • Loading...

More Telugu News