BSE: మార్కెట్ సూచీలు పైపైకి..!
- లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు
- బ్రిటానియా, టెక్ మహీంద్రా షేర్లకు లాభాలు
- ఐటీ, ఫార్మా కంపెనీల ముందంజ
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ జోరు ప్రదర్శించాయి. నిఫ్టీ 11,900 పాయింట్ల పైన ముగియగా, సెన్సెక్స్ సైతం అదే ఊపులో ముగిసింది. సెన్సెక్స్ 168 పాయింట్ల వృద్ధితో 39,784 వద్ద ముగియగా, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 11,922 వద్ద స్ధిరపడింది. ఇవాళ్టి ట్రేడింగ్ లో 1619 షేర్లు నష్టాలు చవిచూడగా, 967 షేర్లు లాభాల బాటలో పయనించాయి. మరో 172 షేర్ల పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు.
బ్రిటానియా ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు భారీస్థాయిలో లాభాలు కళ్లజూశాయి. బీపీసీఎల్, యెస్ బ్యాంక్, కోల్ ఇండియా, గెయిల్, టాటా మోటార్స్ షేర్లకు నష్టాలు తప్పలేదు. ఎనర్జీ రంగం, ప్రభుత్వరంగ బ్యాంకులు మినహాయించి ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మెటల్, ఇన్ఫ్రా కంపెనీల షేర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.