Hyderabad: ‘ఐటీ గ్రిడ్’ ఎండీ అశోక్ కు ముందస్తు బెయిల్ మంజూరు
- ముందస్తు బెయిల్ కోసం మరోమారు పిటిషన్ దాఖలు
- ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం
- దేశం విడిచి వెళ్లొద్దని అశోక్ కు ఆదేశాలు
ఆధార్, ఇతర డేటా చోరీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ కు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం అశోక్ ఈరోజు మరోమారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకూడదని, పాస్ పోర్టు అప్పగించాలని, వారంలో ఒక రోజు పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆ ఆదేశాల్లో అశోక్ ను ఆదేశించింది. కాగా, గతంలో అశోక్ పై డేటా చోరీ కేసు నమోదైంది. ఈ కేసు విషయమై పలు దఫాలు అశోక్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులకు అశోక్ ఇంత వరకూ స్పందించక పోవడం గమనార్హం.