International cricket: అంతర్జాతీయ క్రికెట్ కు యువరాజ్ సింగ్ గుడ్ బై

  • పదిహేడేళ్లు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగిన యూవీ
  • 40 టెస్ట్ లు, 304 వన్డేలు, 58 టీ-20 లు ఆడాడు
  • యూవీ ఆల్ రౌండ్ ప్రతిభతో 2011 వరల్డ్ కప్ భారత్ కు దక్కింది

అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ వీడ్కోలు ప్రకటించాడు. ప్రత్యేక మీడియా సమావేశంలో యూవీ మాట్లాడుతూ, అంతర్జాతీయ క్రికెట్ కు మాత్రమే గుడ్ బై చెబుతున్నట్టు చెప్పాడు. పదిహేడేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగిన యూవీ, ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు కొట్టిన అరుదైన రికార్డు అతని సొంతం. తన కెరీర్ లో 40 టెస్ట్ లు, 304 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. వన్డేల్లో 8701, టెస్టుల్లో 1900, టీ-20ల్లో 1177 పరుగులు చేశాడు. వన్డేల్లో 14, టెస్టుల్లో 3 సెంచరీలు చేశాడు. వన్డేల్లో 111, టెస్టుల్లో 9,  టీ-20లలో 28 వికెట్లు తీశాడు. యూవీ ఆల్ రౌండ్ ప్రదర్శనతో 2011 వరల్డ్ కప్ ను భారత్ గెల్చుకుంది.

2000, అక్టోబర్ 3న కెన్యాపై తొలి వన్డే, 2003లో న్యూజిలాండ్ పై తొలి టెస్ట్ యూవీ ఆడాడు. 2017, జూన్ 30న వెస్టిండీస్ పై చివరి వన్డే, 2012, డిసెంబర్ 9న ఇంగ్లండ్ లో చివరి టెస్టు మ్యాచ్ ను యూవీ ఆడాడు.

International cricket
yuvaraj singh
retirement
  • Loading...

More Telugu News