Vijay Sai Reddy: బీసీలకు 50 శాతం నామినేషన్ పనులు: విజయసాయి రెడ్డి

  • సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు
  • ఇది బలహీన వర్గాల ప్రభుత్వమే
  • ట్విట్టర్ లో ఎంపీ విజయసాయిరెడ్డి

 తమది బలహీనవర్గాల ప్రభుత్వమేనన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా, ఈ ఉదయం కొన్ని ట్వీట్లు చేశారు. "జగన్ గారి కేబినెట్లో 60% మంత్రులు అణగారిన వర్గాలకు చెందిన వారే. దేశంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది కచ్చితంగా బలహీనవర్గాల ప్రభుత్వమే. బీసీలకు 50% నామినేషన్ పనులు కేటాయించి ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని జగన్‌ గారు హామీ ఇచ్చారు" అని అన్నారు.

అంతకుముందు, "రాష్ట్రాభివృద్ధికి తన సహకారం సదా ఉంటుందని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. స్పెషల్ స్టేటస్‌ తో సహా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఆయన తోడ్పాటునిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్‌ గారు యజ్ఞంలా చేపట్టిన కార్యక్రమాలకు కేంద్రం బాసటగా నిలవాలి" అని అన్నారు. దీంతో పాటే, "తమ వేతనాన్ని 3 వేల నుంచి 6 వేలకు పెంచాలని ధర్నా చేసిన 'ఆశా' అక్కా చెల్లెళ్లపై మహిళా దినోత్సవం రోజునే పోలీసులను ఉసిగొల్పి అరెస్టు చేయించాడు చంద్రబాబు. సీఎం జగన్ గారు ముందస్తు హామీ ఇవ్వకున్నా వారి వేతనాలను 300% పెంచుతూ కొత్త ఆశలు నింపారు. పాలకుడికి, మ్యానిపులేటర్‌ కి తేడా ఇదే బాబూ" అని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News