Vijay Mallya: భారత్-ఆసీస్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన విజయ్ మాల్యాకు చేదు అనుభవం!

  • భారత్-ఆసీస్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన మాల్యా
  • అతడిని చూడగానే రెచ్చిపోయిన ప్రేక్షకులు
  • విజయ్ మాల్యా దొంగ అంటూ నినాదాలు

భారత్‌లోని బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగవేసి లండన్‌లో దర్జాగా తిరుగుతున్న పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు చేదు అనుభవం ఎదురైంది. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు తల్లితో కలిసి వచ్చిన మాల్యా మ్యాచ్ చూడ్డంలో నిమగ్నమయ్యాడు.

అయితే, చుట్టూ ఉన్న ప్రేక్షకులు మాల్యాను చూడగానే రెచ్చిపోయారు. ‘విజయ్ మాల్యా చోర్ హై, చోరో.. చోర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘మనిషిలా ప్రవర్తించు.. దేశానికి క్షమాపణలు చెప్పు’ అన్న నినాదాలు కూడా వినిపించాయి. దీనికి స్పందించిన విజయ్ మాల్యా.. ‘సరే అలాగే చేద్దాం’ అని బదులివ్వడం విశేషం.

ప్రేక్షకులు దొంగ, దొంగ అని అరుస్తుండడాన్ని గమనించిన మీడియా.. మాల్యాను పలకరించింది. వారు అలా అరుస్తుంటే మీకేమనిపించిందని ప్రశ్నించగా, తన తల్లి బాధపడకుండా చూసుకున్నానని జవాబిచ్చాడు.

Vijay Mallya
London
India
Australia
Chor
  • Loading...

More Telugu News