Pushpa Srivani: ఏపీ మంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీ కానే కాదంటున్న అప్పలనర్స!

  • కురుపాం నుంచి గెలిచిన పుష్ప శ్రీవాణి
  • కులంపై కేసు నడుస్తూ ఉందన్న అప్పలనర్స
  • ఎస్టీ కాని వారికి ఎస్టీ కోటాలో మంత్రి పదవిపై అభ్యంతరం

విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించడంతో పాటు, జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స ఆరోపించారు. ఆమె కులానికి సంబంధించిన కేసు కోర్టు విచారణలో ఉందని, అటువంటప్పుడు ఆమెను ఎస్టీగా పరిగణిస్తూ, మంత్రివర్గంలోకి తీసుకుని, గిరిజన సంక్షేమ శాఖను ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు.

 అరకులో మీడియాతో మాట్లాడిన ఆయన, పుష్ప శ్రీవాణి సోదరి రామతులసి ఎస్టీ కాదని గతంలో అధికారులు ధ్రువీకరించారని, ఈ నేపథ్యంలోనే ఆమె తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. సోదరి రామతులసి ఎస్టీ కానప్పుడు పుష్పశ్రీవాణి ఎస్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆమె తొలిసారి గెలిచినప్పుడే కోర్టులో కేసు దాఖలైందని, అది ఇంకా విచారణలో ఉండగానే, రెండోసారి ఆమెకు టికెట్‌ ఇచ్చారని అప్పలనర్స అన్నారు. గెలిచిన ఆమెకు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖలను ఎలా ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News