Hyderabad: నిలకడగానే అక్బరుద్దీన్ ఆరోగ్యం.. సోషల్ మీడియా ప్రచారంపై పార్టీ స్పందన

  • 2011లో అక్బరుద్దీన్‌పై దాడి
  • అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఎమ్మెల్యే
  • ప్రస్తుతం లండన్‌లో చికిత్స తీసుకుంటున్న అక్బరుద్దీన్

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం క్షీణించిందంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ స్పందించింది. అక్బర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఏప్రిల్ 2011లో బార్కస్‌లో అక్బరుద్దీన్‌పై దాడి జరిగింది. కాల్పులు, కత్తిపోట్లకు గురైన అక్బరుద్దీన్ అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు. అయితే, ఇటీవల ఆయన ఆరోగ్యం కొంత క్షీణించడంతో చికిత్స కోసం లండన్ వెళ్లారు.  

రంజాన్ అనంతరం పార్టీ కార్యాలయంలో అసదుద్దీన్ మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే, భయపడాల్సినంతగా ఏమీ లేదని, అక్బర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తాజాగా పార్టీ వెల్లడించింది.

Hyderabad
London
Akbaruddin Owaisi
MIM
  • Loading...

More Telugu News