Vadivelu: హాస్యాన్ని పండించడంలో దిట్ట కానీ స్క్రిప్ట్‌ను మాత్రం వడివేలు రాయలేరు: దర్శకుడు నవీన్

  • నటన పరంగా వడివేలు అంటే చాలా ఇష్టం
  • నటుడిగా నిజాయతీగా ఉంటారు
  • భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి?

తమిళ హాస్య నటుడు వడివేలు హీరోగా రూపొందుతున్న ‘ఇంసై అరసన్‌ 24 ఏఎం పులికేసి’ తమిళ చిత్రం భిన్నాభిప్రాయాల కారణంగా ఆగిపోయింది. కథలో మార్పులు చేయమని వడివేలు కోరుతున్నాడనేది ఈ చిత్ర దర్శకుడు శింబు దేవన్ ప్రధాన ఆరోపణ. అయితే శింబు దేవన్ తనకు స్వేచ్ఛ ఇవ్వలేదని, బలవంతంగా ముందుకు లాగించేస్తున్నాడని, తను లేకుండా సినిమాను పూర్తి చేయడం అసాధ్యమని వడివేలు ఇటీవల వ్యాఖ్యానించాడు.

వడివేలు వ్యాఖ్యాలపై శింబు సహాయ దర్శకుడు నవీన్ స్పందించారు. సెట్‌లో నటన పరంగా వడివేలు అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ఓ నటుడిగా నిజాయతీగా ఉండటమే కాకుండా హాస్యాన్ని పండించడంలో దిట్ట అని నవీన్ పేర్కొన్నారు. అయితే స్క్రిప్టును మాత్రం వడివేలు రాయలేరని వ్యాఖ్యానించారు. నిజానికి ‘ఇంసై అరసన్’ సినిమా విజయానికి వడివేలు కారణమైతే, ఆయన హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయని నవీన్ ప్రశ్నించారు.

Vadivelu
Naveen
Simbu Devan
Insai Arasan 24 PM Pulakesi
  • Loading...

More Telugu News