Telugudesam: రాజకీయాల నుంచి చంద్రబాబు తప్పుకోవడం మంచిది: వైసీపీ నేత దాడి వీరభద్రరావు

  • టీడీపీని ప్రజలు తిప్పి కొట్టారు
  • టీడీపీ ఓటమికి చంద్రబాబు, లోకేశ్ లే కారణం
  • దేశంలోనే ఓ మోడల్ సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదని వైసీపీ నేత దాడి వీరభద్రరావు సూచించారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొన్నటి ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. టీడీపీ ఓటమిపాలు కావడానికి చంద్రబాబు, లోకేశ్ లే కారణమని గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో గజదొంగల పాలన పోయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే ఓ మోడల్ సీఎం జగన్ అని, దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆయన పాలన వైపే చూస్తున్నాయని అన్నారు.

Telugudesam
Chandrababu
YSRCP
jagan
dadi
  • Loading...

More Telugu News