Vijay Mallya: నేను వచ్చింది టీమిండియా మ్యాచ్ చూడ్డానికి... లండన్ స్టేడియంలో విజయ్ మాల్యా ప్రత్యక్షం

  • వరల్డ్ కప్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన మాల్యా
  • పలకరించిన మీడియా
  • సీరియస్ గా బదులిచ్చిన మాల్యా

ఒకప్పుడు కింగ్ ఫిషర్ బ్రాండ్ తో వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలిన విజయ్ మాల్యా ఇప్పుడు అప్పుల బాధ తట్టుకోలేక లండన్ లో తలదాచుకుంటున్నారు. భారత్ లో బ్యాంకులకు వేలకోట్ల మేర రుణాలు ఎగవేసి లండన్ పారిపోయిన మాల్యాను రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే, క్రికెట్ అభిమాని అయిన మాల్యా తాజాగా లండన్ లోని ఓవల్ స్టేడియం వద్ద ప్రత్యక్షమయ్యారు.

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ చూడ్డానికి వచ్చారు. ఈ సందర్భంగా, ఆయనను మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసింది. కోర్టులో ఉన్న కేసుల వివరాలు అడిగిన ఓ మీడియా ప్రతినిధి వైపు తీక్షణంగా చూసిన మాల్యా...  నేను ఇక్కడికి వచ్చింది క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి అంటూ అక్కడ్నించి గంభీరంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ మ్యాచ్ కోసం మాల్యా తనయుడు సిద్ధార్థ్ కూడా వచ్చారు.

Vijay Mallya
  • Error fetching data: Network response was not ok

More Telugu News