Tirumala: తిరుమల బయలు దేరిన మోదీ

  • మోదీతో పాటు గవర్నర్ నరసింహన్, సీఎం జగన్
  • పద్మావతి గెస్ట్ హౌస్ లో సేదతీరనున్న మోదీ
  • సాధారణ భక్తులకు ఆలయంలోకి అనుమతించని అధికారులు

తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ప్రజా ధన్యవాద సభ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలకు బయలుదేరారు. మోదీతో పాటు గవర్నర్ నరసింహన్, సీఎం జగన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తదితర నేతలు స్వామి వారిని దర్శించుకోనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పద్మావతి గెస్ట్ హౌస్ లో మోదీ కొద్దిసేపు సేద తీరనున్నారు. ఇదిలా ఉండగా, స్వామి వారిని మోదీ దర్శించుకోనున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయంలోకి సాధారణ భక్తులను అధికారులు అనుమతించడం లేదు. ఇప్పటికే లోపల ఉన్న భక్తులకు దర్శనం కల్పించి బయటకు పంపుతున్నారు.


Tirumala
Tirupati
modi
jagan
narasimhan
  • Loading...

More Telugu News