Virat Kohli: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన.. తను చదివిన పాఠశాల మట్టిని తెప్పించుకుని వాసన చూసి బరిలోకి దిగిన కోహ్లీ!
- ఢిల్లీలోని విశాల్ భారతి స్కూల్లో చదివిన కోహ్లీ
- 1998లో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేరిక
- 2008లో ఇండియన్ క్రికెట్‌లో చేరిన కోహ్లీ
ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో నేడు భారత్ - ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ పరుగుల వరద పారిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. మ్యాచ్‌కు ముందు కోహ్లీ తను చదువుకున్న పాఠశాల మైదానంలోని మట్టిని వాసన చూసి మరీ బరిలోకి దిగాడు. ఈ విధంగా మాతృభూమిపై మమకారాన్ని చాటుకోవడం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
కోహ్లీ ఢిల్లీలోని విశాల్ భారతి స్కూల్లో తొమ్మిదో గ్రేడ్ వరకూ చదివాడు. ఆ సమయంలోనే 1998లో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేరాడు. అదే తన ఎదుగుదలకు బీజం వేసింది. అనంతరం తన టాలెంట్‌తో 2008లో ఇండియన్ క్రికెట్‌లో చేరి, ప్రస్తుతం టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కోహ్లీ మ్యాచ్‌కు ముందు తన పాఠశాల మట్టిని తెప్పించుకుని వాసన చూశాడు.