Khammam: ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో దారుణం... రోగులకు ఇంజెక్షన్లు చేస్తున్న స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు!

  • మాతాశిశు కేంద్రంలో అందుబాటులో లేని నర్సులు!
  • నర్సులు చేయాల్సిన పనులు చేస్తున్న స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న రోగులు, వారి కుటుంబసభ్యులు

ప్రభుత్వాసుపత్రులపై పర్యవేక్షణ కొరవడితే ఎంతటి దారుణాలు చోటుచేసుకుంటాయో గతంలో ఎన్నో దృష్టాంతాలున్నాయి. తాజాగా ఖమ్మం ప్రభుత్వాసుపత్రి కూడా అవకతవకలకు నెలవుగా మారింది. ఇక్కడి మాతాశిశు కేంద్రంలో విధులు నిర్వర్తించాల్సిన నర్సులు అందుబాటులో లేకుండా పోవడంతో, స్వీపర్లు, సెక్యూరిటీ సిబ్బందే రోగులకు ఇంజెక్షన్లు చేయడం, సెలైన్లు అమర్చడం వంటి పనులు చేస్తున్నారు.

బాలింతలకు ఎంతో శ్రద్ధతో వైద్యం చేయాల్సి ఉండగా, వారికి కూడా స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు తమకు తోచిన వైద్యం చేస్తుండడం భీతిగొలుపుతోంది. ఇదంతా చూస్తున్న రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ లో స్వీపర్లు, సెక్యూరిటీ గార్డుల వైద్యం అంటూ సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వ్యవహారం వైరల్ గా మారింది. ఖమ్మం ఆసుపత్రి కొంతకాలం కిందట కూడా ఇదే రీతిలో సంచలనానికి కారణమైంది. ఓ మహిళ ప్రసవిస్తుండగా, సిబ్బంది ఫొటోలు తీయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

  • Loading...

More Telugu News