Ramgopal Varma: పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ

  • ఓటర్లను అవమానించేలా పవన్ వ్యాఖ్యలు
  • నిజంగా గెలిపించాలని అనుకుంటే డబ్బు తీసుకున్నా ఓట్లేసేవారు
  • ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ

తనను ఓడించడానికి ప్రత్యర్థులు రూ. 150 కోట్లను ఖర్చు చేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తనదైన శైలిలో స్పందించారు. పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమేనన్న వర్మ, పవన్ ను నిజంగా గెలిపించాలని ఓటర్లు అనుకుంటే, ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా, అతనికే ఓటేసేవారని వ్యాఖ్యానించారు. తాను సేవ చేయాలని అనుకున్న ప్రజలు అవినీతిపరులన్నట్టుగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కాగా, నిన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తాను ఓడిపోవాలని రూ. 150 కోట్లు ఖర్చు పెట్టారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఓటమితో జనసేన కార్యకర్తలు కుంగిపోవద్దని, తాను 25 సంవత్సరాలు రాజకీయాలు చేసేందుకే వచ్చానని కూడా ఆయన అన్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News