Aroon Finch: ఆ నలుగురితోనే అసలు డేంజర్: ఆరోన్ ఫించ్

  • నేడు భారత్, ఆసీస్ మధ్య మ్యాచ్
  • కోహ్లీకి అవకాశమిస్తే ఆపడం కష్టం
  • ధోనీ, రోహిత్, ధావన్ లు ప్రమాదకరం

క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకోగల సత్తా ఉన్న జట్లుగా పేరున్న భారత్, ఆస్ట్రేలియాలు నేడు గ్రూప్ దశలో భాగంగా ఓవెల్ మైదానంలో పోరాడనుండగా, ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులోని నలుగురితో తమకు అసలు సిసలైన డేంజర్ ఎదురు కానుందన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓసారి అవకాశం ఇస్తే, ఇక ఆపడం కష్టమవుతుందని, అతనితో పాటు రోహిత్ శర్మ, ధోనీ, శిఖర్ ధావన్ లు ప్రమాదకర ఆటగాళ్లని అభిప్రాయపడ్డాడు. వారిని సాధ్యమైనంత త్వరగా పెవీలియన్ కు పంపించాల్సి ఉందని, అదే జరగకుంటే ఎటువంటి పెద్ద జట్టుకైనా గడ్డుకాలమేనన్నాడు. తమ జట్టుకు ఓ ప్లాన్ ప్రకారం బ్యాటింగ్ చేసే స్మిత్ ఎంతో బలమని అరోన్ ఫించ్ వ్యాఖ్యానించాడు.

Aroon Finch
Virat Kohli
India
Australia
MS Dhoni
Rohit Sharma
  • Loading...

More Telugu News