Mahesh Babu: ఆస్ట్రేలియాతో భారత మ్యాచ్ కి ప్రత్యేక అతిథి... స్వయంగా వీక్షించనున్న మహేశ్ బాబు!

  • నేడు ఓవల్ వేదికగా మ్యాచ్
  • మధ్యాహ్నం 3 గంటలకు పోరు
  • ఫ్యామిలీతో సహా హాజరుకానున్న మహేశ్

భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్ లంటే సామాన్య అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపిస్తారు. అందునా ఆస్ట్రేలియా వంటి జట్టుతో, అది కూడా వరల్డ్ కప్ అయితే... ఆ మ్యాచ్ పై ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక తాను నటించిన 'మహర్షి' సూపర్ హిట్ కావడంతో, ప్రస్తుతం తన ఫ్యామిలీతో పలు దేశాల్లో పర్యటిస్తూ, సెలబ్రేట్ చేసుకుంటున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, నేడు ఓవ‌ల్ మైదానంలో జరిగే ఆస్ట్రేలియా, భార‌త్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌ కి భార్యా, పిల్లలతో కలిసి హాజ‌రు కానున్నాడ‌ట‌. ఈ మ్యాచ్ నేడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఇక స్టేడియంలో మహేశ్, భారత జట్టుకు మద్దతిస్తూ, ఎలా అల్లరి చేస్తాడో వేచి చూడాలి.

Mahesh Babu
Namrata
India
Cricket
Australia
  • Loading...

More Telugu News