Tamil Nadu: తమిళనాడులో ఊపందుకున్న హిందీ వ్యతిరేక ఉద్యమం

  • కేంద్ర ప్రతిపాదించిన త్రిభాషా సూత్రంపై తమిళ ప్రజల మండిపాటు
  • ప్రభుత్వ కార్యాలయ బోర్డుపై ఉన్న హిందీ అక్షరాలపై నల్లరంగు
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది. హిందీ అక్షరాలు కనిపిస్తే చాలు నిరసనకారులు నల్లరంగు పూస్తున్నారు. తాజాగా తిరుచ్చిలోని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలపై నల్లరంగు పూశారు. బీఎస్‌ఎన్ఎల్ కార్యాలయం, పోస్టాఫీసులు, తిరుచురాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం సైన్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలను నల్లరంగుతో పూర్తిగా కప్పేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఇటీవల కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రంపై మండిపడుతున్న తమిళ ప్రజలు అప్పటి నుంచి తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దని నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. కాగా, సైన్‌బోర్డులపై నల్లరంగు పూసిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tamil Nadu
Trichy
Hindi
anti-Hindi imposition
  • Loading...

More Telugu News