Andhra Pradesh: మంత్రులకు ఇన్నోవా కార్లను కేటాయించిన ఏపీ ప్రభుత్వం!

  • ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు
  • ఇన్నోవా కార్లను ఇచ్చిన ప్రభుత్వం
  • ఈరోజు సాయంత్రం మంత్రిత్వశాఖల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో 25 మంది మంత్రులతో ఈరోజు ఏపీ కేబినెట్ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, పాముల పుష్పవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ), పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఈరోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వీరికి కొత్తగా ఇన్నోవా కార్లను కేటాయించింది. ఈ 25 మంది మంత్రులకు జగన్ ఏయే బాధ్యతలు అప్పగించబోతున్నారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈరోజు సాయంత్రం నాటికి సీఎం జగన్ మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకేసారి ఏడుగురు సభ్యులు ప్రయాణించగల టయోటా ఇన్నోవా కార్ల ప్రారంభ ధర మార్కెట్ లో రూ.14.93 లక్షల నుంచి రూ.23.24 లక్షల వరకూ ఉంటుంది. ఈ కారు పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో మార్కెట్ లో లభ్యమవుతోంది.

Andhra Pradesh
Jagan
25 ministers
innova cars
alloted
  • Loading...

More Telugu News