ram madhav: భారత్ 100వ స్వాతంత్య్రదినోత్సవం జరుపుకునే వరకు మేమే అధికారంలో ఉంటాం!: బీజేపీ నేత రాంమాధవ్

  • జాతీయవాదం అనేది బీజేపీ డీఎన్ఏ
  • మోదీ హయాంలో సరికొత్త భారత్ రూపుదిద్దుకుంది
  • 2047 నాటికి విశ్వగురువుగా అవతరిస్తుంది

కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన అంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ మండిపడ్డారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ రికార్డును మోదీ బద్దలు కొడతారని... భారత్ 100వ స్వాతంత్య్రదినోత్సవం జరుపుకునే వరకు బీజేపీనే దేశాన్ని పాలిస్తుందని అన్నారు. త్రిపురలో నిర్వహించిన ఓ సభలో రాంమాధవ్ మాట్లాడుతూ, జాతీయవాదం అనేది బీజేపీ డీఎన్ఏ అని చెప్పారు. మోదీ హయాంలో సరికొత్త భారతదేశం రూపుదిద్దుకుందని... ఇల్లు లేనివారు, ఉద్యోగం లేని వారు ఉండబోరని అన్నారు.  2047లో మనం 100వ స్వాతంత్య్రదినోత్సవం జరుపుకునే వరకు బీజేపీ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. అప్పటికి భారత్ 'విశ్వగురువు'గా అవతరిస్తుందని అన్నారు.

ram madhav
modi
bjp
congress
  • Loading...

More Telugu News