Andhra Pradesh: అనిల్.. నువ్వు మంత్రి పదవికి అర్హుడివి!: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

  • మంత్రివర్గంలో చేరిన అనిల్ కుమార్
  • హర్షం వ్యక్తం చేసిన రూరల్ ఎమ్మెల్యే
  • నూతన కేబినెట్ కు శుభాకాంక్షలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంలో నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తన సోదరుడు మంత్రి కావడం నిజంగా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. అనిల్ మంత్రి పదవికి నిజంగా అర్హుడని చెప్పారు.

ఈరోజు ట్విట్టర్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘మా నాయకుడు వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ఏర్పడ్డ నూతన కేబినెట్ కు శుభాకాంక్షలు. మంత్రులంతా రాబోయే రోజుల్లో అద్భుతంగా పనిచేస్తారని కోరుకుంటున్నా. నా సోదరుడు అనిల్ మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. అనిల్.. మంత్రి పదవికి నువ్వు అర్హుడివి’ అని కోటంరెడ్డి ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Nellore District
Jagan
anil kumar
Minister
kotamreddy sridhar reddy
Twitter
  • Loading...

More Telugu News