Most Honourable Order of the Distinguished Rule of Nishan Izzuddeen: ప్రధాని మోదీకి మరో గౌరవం.. ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించనున్న మాల్దీవులు!
- రెండోసారి బాధ్యతల స్వీకరణ అనంతరం తొలి పర్యటన
- కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ
- అనంతరం శ్రీలంకకు పయనం
ప్రధాని మోదీ నేడు మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటి విదేశీ పర్యటనలో భాగంగా నేడు మాల్దీవుల్లో, రేపు శ్రీలంకలో మోదీ పర్యటిస్తారు. ఈ టూర్ లో భాగంగా ప్రధాని మాల్దీవుల్లో జాతీయ రక్షణ దళం శిక్షణా కేంద్రంతో పాటు అత్యాధునిక తీరప్రాంత రాడార్ నిఘా వ్యవస్థను మోదీ ప్రారంభిస్తారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక ‘ఆర్డర్ ఆఫ్ నిషానిజుద్దీన్’ అవార్డును ప్రకటించాలని మాల్దీవులు నిర్ణయించింది. ఈ విషయాన్ని మాల్దీవుల ప్రధాని అబ్దుల్లా షాహీద్ ప్రకటించారు. ఈ పర్యటన తర్వాత శ్రీలంకకు ఆదివారం వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఈస్టర్ ఉగ్రదాడుల్లో చనిపోయిన ప్రజలకు నివాళులు అర్పిస్తారు. అనంతరం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. తిరిగి అదేరోజున భారత్ కు చేరుకుంటారు.