Andhra Pradesh: ముగిసిన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం

  • 25 మంది కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తి
  • తొలుత ధర్మాన, చివరగా శంకర నారాయణ ప్రమాణం
  • ఆదిమూలపు సురేశ్, మేకపాటి గౌతమ్ రెడ్డి ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం

ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. గవర్నర్ సమక్షంలో 25 మంది కొత్త మంత్రులు తమ ప్రమాణ స్వీకారాలు చేశారు. తొలుత ధర్మాన కృష్ణ ప్రసాద్, చివరగా శంకర నారాయణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేశ్, నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఆంగ్ల భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. శంకరనారాయణకు ముందు కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా ‘అల్లా సాక్షిగా’ ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. కొత్త మంత్రులను సీఎం జగన్ అభింనందించారు.   ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం కొత్త మంత్రి వర్గంతో గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ లు గ్రూప్ ఫొటో దిగారు.

Andhra Pradesh
cabinet
oath swearing
cm
jagan
governer
narasimhan
  • Loading...

More Telugu News