Andhra Pradesh: కర్నూలు జిల్లాలో లోయలోకి పల్టీలు కొట్టిన బస్సు.. 15 మందికి తీవ్రగాయాలు!

  • ఏపీలోని శ్రీశైలంలో ఘటన
  • అదుపు తప్పి లోయలోకి జారిపోయిన వాహనం
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు లోయలోకి జారిపోయింది. తమిళనాడు నుంచి శ్రీశైలానికి ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బయలుదేరింది. అయితే శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సు వేగాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలమయ్యాడు. దీంతో అదుపుతప్పిన వాహనం పక్కనే ఉన్న లోయలోకి పల్టీలు కొడుతూ జారిపోయింది.

ఈ దుర్ఘటనలో 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. అటుగా వెళుతున్న వాహనదారులు ఈ ప్రమాదాన్ని గమనించి పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? ట్రావెల్స్ బస్సుకు ఫిట్ నెస్ పర్మిట్ ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh
Kurnool District
Road Accident
15 serious injuries
Police
private travels
slipped into
vally
  • Loading...

More Telugu News