Rahul Gandhi: వయనాడ్ లోని ప్రతీఒక్కరికీ నా ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి!: రాహుల్ గాంధీ

  • పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అందుబాటులో ఉంటాను
  • కేరళ సమస్యలను కూడా లోక్ సభలో ప్రస్తావిస్తా
  • కాల్పెట్ట రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు కూడా వయనాడ్ లో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచి ఓడిపోయిన రాహుల్.. వయనాడ్ నుంచి 4.31 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఈ నేపథ్యంలో రాహుల్ నేడు కూడా వయనాడ్ లోని కాల్పెట్టలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను భారీ మెజారిటీతో గెలిపించిన వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

‘వయనాడ్ లోని ప్రతీఒక్కరికీ నా ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి. సిద్ధాంతాలకు అతీతంగా, ప్రాంతాలు, పార్టీలతో సంబంధం లేకుండా నేను అందరికీ అందుబాటులో ఉంటాను. కేరళలోని వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వయనాడ్ తో పాటు రాష్ట్ర సమస్యలను కూడా లోక్ సభ లో ప్రస్తావిస్తాను’ అని రాహుల్ గాంధీ చెప్పారు.

Rahul Gandhi
Congress
vayanad
  • Loading...

More Telugu News