Andhra Pradesh: రుణ ఎగవేత దారులు విదేశాలకు పారిపోకముందే పట్టుకోవాలి!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

  • భారత్ గొప్ప వృద్ధిని నమోదు చేస్తోంది
  • చట్టసభల్లో సభ్యులే అడ్డంకులు సృష్టిస్తున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన ఉపరాష్ట్రపతి

భారత్ గొప్ప వృద్ధిని నమోదు చేస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆరోగ్యం, ఉద్యోగ కల్పన, మెరుగైన మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను కల్పించడం ద్వారా ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా ఈ ఆర్థికవృద్ధిని మరల్చాలని సూచించారు. సమర్థవంతమైన నిర్వహణా పద్ధతుల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో ఈ లక్ష్యాలను చేరుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు వెంకయ్య నాయుడు ట్విట్టర్ లో స్పందించారు. ఇక చట్ట సభల్లోనూ సభ్యులు అర్థవంతమైన చర్చలు జరపడానికి బదులుగా సభా కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రుణఎగవేత దారులు, మోసాలకు పాల్పడిన కంపెనీల యజమానులు విదేశాలకు పారిపోకముందే వారిని చట్టం ముందుకు తీసుకొచ్చి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరముందని వెంకయ్య అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh
Telangana
Venkaiah Naidu
Twitter
  • Loading...

More Telugu News