CM Jagan: మన పాలనలో వైవిధ్యం ఉండాలి...మార్పు కనిపించాలి: సచివాలయ అధికారులతో సీఎం జగన్‌

  • తొలిసారి విభాగాధిపతులతో ఈరోజు సచివాలయంలో సమావేశం
  • మీ అనుభవాలను మంచి పాలన అందించేందుకు ఉపయోగించాలని సూచన
  • ఫలితాలు చూపించిన వారిని సత్కరిస్తానని దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోకి ఈరోజు తొలిసారి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విభాగాల అధిపతులు, కార్యదర్శులు, సీనియర్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమకు ప్రభుత్వాన్ని అప్పగించారని, మన పాలనలో వైవిధ్యం ఉండాలని, మార్పు కనపించాలని కోరారు.

అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించినప్పుడే ప్రభుత్వం, ప్రజల కలలు నెరవేరుతాయని చెప్పారు. ‘ఉత్తమ పాలన అందించాలన్నది నా ఆశయం. అవినీతికి ఆస్కారంలేని పారదర్శక పాలన అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్నాను. నా ప్రయత్నానికి మీ వంతు సహకారం అందించండి. మీపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీ అనుభవాన్ని మంచి ఫలితాలు సాధించేందుకు వినియోగిస్తారని ఆశిస్తున్నా’ అని దిశా నిర్దేశం చేశారు.

అవినీతిని నిర్మూలించాలని, ప్రభుత్వ వ్యయంలో దుబారాను అరికట్టి నిధులు ఆదా చేయాలని కోరారు. మంచి ఫలితాలు సాధించిన అధికారులను సత్కరించి గౌరవించనున్నట్లు ప్రకటించారు. 

  • Loading...

More Telugu News