YSRCP: జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తా: కొడాలి నాని

  • మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కొడాలి
  • జగన్ సీఎం కావాలన్న మా లక్ష్యం నెరవేరింది
  • ఏపీ ప్రజలకు ఇకపై అంతా మంచే జరుగుతుంది

జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు సచివాలయానికి వచ్చిన కొడాలి నానిని ఈ సందర్భంగా మీడియా పలకరించింది. జగన్ ఏ బాధ్యతలు తనకు అప్పగించినా నిర్వహిస్తానని చెప్పిన కొడాలి, తనకు మంత్రి పదవులు ముఖ్యం కాదని వ్యాఖ్యానించడం గమనార్హం. వైఎస్ జగన్ సీఎం కావాలన్న తమ లక్ష్యం నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు ఇకపై అంతా మంచే జరుగుతుందని అన్నారు.

YSRCP
jagan
cm
gudivada
mla
kodali
  • Loading...

More Telugu News