government VIP's: ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందే విప్‌ల నియామకం...వీరికే అవకాశం
- చీఫ్ విప్‌గా శ్రీకాంత్ రెడ్డి
- విప్‌లుగా మరో ఐదుగురికి అవకాశం
- అంతా మంత్రి పదవులు ఆశించినవారే
మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ విప్‌ల జాబితాను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈరోజు మధ్యాహ్నం 11.49 గంటలకు 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. మంత్రుల జాబితాలో చోటు దక్కని కొందరిని విప్ పదవులు వరించాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఈరోజు ఉదయం సచివాలయంలోకి ముఖ్యమంత్రి అడుగుపెట్టారు.
అనంతరం అన్ని శాఖల హెచ్‌ఓడీలతో ఆయన సమావేశంలో ఉండగానే ప్రభుత్వ చీఫ్ విప్‌గా పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిని, విప్‌లుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, పార్థసారథి, కొరుముట్ల శ్రీనివాస్‌లను జగన్ నియమించినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి.
వీరిలో దాదాపు అందరూ మంత్రి పదవి ఆశించినవారే. సామాజిక సమతూకంలో భాగంగా వీరికి మంత్రి పదవులు దక్కలేదు. దీంతో విప్‌లుగా ఈ ఐదుగురు కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. కీలకమైన అసెంబ్లీ సమావేశాల సమయంలో పలు అంశాల పర్యవేక్షణ, ప్రభుత్వ కార్యకలాపాల పర్యవేక్షణ అంశాల్లో చీఫ్ విప్ బాధ్యతలు కలిగి ఉంటారు. ఈయనకు విప్‌లు సాయపడతారు.