Andhra Pradesh: సచివాలయంలో మూడు కీలక ఫైళ్లపై సంతకాలకు చేసిన ముఖ్యమంత్రి జగన్

  • ఈ ఉదయం 8:39 గంటలకు సచివాలయంలో అడుగుపెట్టిన జగన్
  • సెక్రటేరియట్ ఉద్యోగుల ఘన స్వాగతం
  • ఇకపై సచివాలయ కేంద్రంగా సీఎం కార్యకలాపాలు

ముఖ్యమంత్రిగా తొలిసారి ఈ ఉదయం సచివాలయంలో అడుగుపెట్టిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మూడు దస్త్రాలపై సంతకం పెట్టారు. ఈ ఉదయం 8:39 గంటలకు సచివాలయంలో అడుగుపెట్టిన జగన్‌కు సచివాలయ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మూడు కీలక ఫైళ్లపై సంతకం చేశారు. ఆశావర్కర్ల వేతనాలను రూ. 10వేలకు పెంచుతూ తొలి సంతకం చేయగా, అనంతరం ఎక్స్‌ప్రెస్‌ హైవేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్ట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ ఫైల్‌పై మూడో సంతకం చేశారు.

Andhra Pradesh
Jagan
Navaratnalu
  • Loading...

More Telugu News