Jagan: ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగుపెట్టిన జగన్

  • 8:39 గంటలకు సచివాలయానికి చేరుకున్న జగన్
  • 9:30 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం
  • ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి హాజరు

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం 8:39 గంటలకు సచివాలయంలో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్ సచివాలయంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. అనుకున్న ముహూర్తానికి సెక్రటేరియట్‌లోని తొలి బ్లాక్‌ మొదటి అంతస్తులో ఉన్న కార్యాలయంలో అడుగుపెట్టిన జగన్ ఉదయం 9.30 గంటలకు  అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అలాగే, ఉదయం 11:15 గంటలకు జరగనున్న ప్రొటెం స్పీకర్  శంబంగి చినఅప్పలనాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా జగన్ హాజరుకానున్నారు.

Jagan
Andhra Pradesh
secretariat
YSRCP
  • Loading...

More Telugu News