ram: దుమ్మురేపేస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' లిరికల్ వీడియో

  • సంగీత దర్శకుడిగా మణిశర్మ
  • మాస్ ఆడియన్స్ ను ఊపేసే సాంగ్
  •  త్వరలో విడుదల తేదీ ప్రకటన

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందుతోంది. నిధి అగర్వాల్ - నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'దిమాక్ ఖరాబ్' అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

'సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక .. పిలగా పిలగా పిలగా పెట్టిపోరా సురక .. " అంటూ ఈ పాట మొదలవుతోంది. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని, ఇద్దరు కథానాయికల కాంబినేషన్లో రామ్ పై చిత్రీకరించిన పాట ఇది. మణిశర్మ సంగీతం .. కాసర్ల శ్యామ్ సాహిత్యం .. కీర్తన శర్మ - సాకేత్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ కి హిట్ పడటం ఖాయమనే అభిప్రాయంలో ఆయన అభిమానులు వున్నారు. వాళ్ల ఆశలను పూరి నిజం చేస్తాడేమో చూడాలి మరి.

  • Loading...

More Telugu News