Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా జీవీడీ కృష్ణ మోహన్ నియామకం

  • కమ్యూనికేషన్స్ సలహాదారుగా ఉండనున్న జీవీడీ
  • సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పీవీ రమేశ్
  • అదనపు కార్యదర్శిగా జె.మురళీ 

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా జీవీడీ కృష్ణ మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు కమ్యూనికేషన్స్ సలహాదారుగా కృష్ణ మోహన్ వ్యవహరించనున్నారు. గతంలో కృష్ణమోహన్ 'ఈనాడు', 'సాక్షి' పత్రికలలో పాత్రికేయుడిగా పనిచేశారు. అలాగే, సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్, అదనపు కార్యదర్శిగా జె.మురళీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Andhra Pradesh
gvd
pv ramesh
lv subramanyam
  • Loading...

More Telugu News