Jagan: జగన్ క్యాబినెట్ లో ఆ ఐదుగురు డిప్యూటీ సీఎంలు వీళ్లేనట!

  • రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ
  • ఆళ్ల నాని, అంజాద్ బాషా, సుచరితలకు డిప్యూటీలుగా చాన్స్
  • రాజన్నదోర, పార్థసారధిలు కూడా

ఈ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకుంటూ, ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉంటారని జగన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటకు రాగానే, రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు తనకు డిప్యూటీలుగా ఉంటారని జగన్ ప్రకటించగా, వారు ఎవరన్న చర్చ జోరందుకుంది.

 ఇక సమావేశంలో పాల్గొన్న నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, కాపు సామాజిక వర్గం నుంచి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, మైనారిటీ కోటాలో కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, ఎస్సీ వర్గం నుంచి ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎస్టీ వర్గం నుంచి సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, బీసీ కులాల నుంచి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధిలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయట.

Jagan
Deputy CM
Alla Nani
Amzad Basha
Sucharita
Rajannadora
Parthasarathi
  • Loading...

More Telugu News