Jagan: ఇది ఒక మహాద్భుతం... జగన్ మాత్రమే తీసుకోగల నిర్ణయం: వైసీపీ నేత ఎల్లసిరి

  • ఐదుగురు డిప్యూటీలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ
  • వైఎస్ ను మించిన పాలనను జగన్ అందిస్తారు
  • వైసీపీ సీనియర్ నేత ఎల్లసిరి గోపాల్ రెడ్డి

తన మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని జగన్ చేసిన ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. ఇది సాహసోపేతమైన నిర్ణయమని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన పార్టీ సీనియర్ నేత ఎల్లసిరి గోపాల్ రెడ్డి, ఇది ఒక మహాద్భుతమని, వైఎస్ జగన్ మాత్రమే ధైర్యంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారని అన్నారు.

పది సంవత్సరాల కఠోర శ్రమకు ఐదు కోట్ల మంది తమ ఓటు రూపంలో ప్రతిఫలాన్ని ఇచ్చారని, దాన్ని పాతిక సంవత్సరాలు కాపాడుకునేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన పొగడ్తలు కురిపించారు. మంత్రుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు వెనుకబడిన తరగతులకు అవకాశం ఇస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నవరత్నాల అమలుతో వైఎస్ ను మించిన పాలనను జగన్ అందించనున్నారని అన్నారు.

Jagan
Yellasiri Gopla Reddy
Deputy CM
  • Loading...

More Telugu News