YSRCP: తాడేపల్లి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు...జగన్ అధ్యక్షతన ఎల్‌పీ సమావేశం

  • కేబినెట్‌ కూర్పు, ప్రజా సంక్షేమ పథకాలపై చర్చ
  • రేపు జరగనున్న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం
  • ఈరోజే విజయవాడ వస్తున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరుకున్నారు. ఈ ఉదయం వైసీపీ ఎల్‌పీ సమావేశం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న విషయం తెలిసిందే. రేపటి మంత్రివర్గం కూర్పు, సంక్షేమ పథకాలపై సమావేశంలో చర్చించనున్నారు.

నవ్యాంధ్రలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ సభ్యులు భేటీ కావడం ఇది రెండోసారి. తొలి సమావేశంలో లెజిస్లేచివ్‌ పార్టీ నాయకునిగా సభ్యులంతా జగన్‌ను ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించడమేకాక పలు నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో రెండోసారి భేటీకి ఎంతో ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు. కాగా, రేపు ఉదయం 11.49 గంటలకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. అందువల్ల  ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజే విజయవాడ చేరుకుంటున్నారు.

YSRCP
LP meet
jagan
tadepalli
  • Loading...

More Telugu News