visakhapatnam: నేనైతే మంత్రి పదవి అడగలేదు...జగన్‌ న్యాయం చేస్తారనే భావిస్తున్నా : పవన్‌కల్యాణ్‌పై గెలిచిన తిప్పలనాగిరెడ్డి

  • గాజువాకలో జనసేన అధినేతపై విజయం
  • బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని
  • ఈ అర్హతలు పరిగణనలోకి తీసుకుంటారనుకుంటున్నాను

తనకు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ని నేను కోరలేదని, కానీ, మంత్రివర్గం కూర్పులో జగన్‌ సమన్యాయం పాటిస్తారన్న నమ్మకం తనకు ఉందని గాజువాక ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై విజయం సాధించిన తిప్పల నాగిరెడ్డి అన్నారు. జగన్‌ మంత్రివర్గంలో విశాఖ  జిల్లా నుంచి ఎవరికి చోటు దక్కనుందన్న విషయంపై తర్జనభర్జన జరుగుతున్న నేపధ్యంలో ఆయన ఓ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడారు. ఓ పార్టీ అధినేతపై విజయం సాధించానని, పైగా వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తినని గుర్తు చేశారు. అన్ని అర్హతలు ఉన్న వారికే జగన్‌ పదవులు కట్టబెడతారని నమ్ముతున్నట్లు తెలిపారు.

visakhapatnam
gajuwaka
tippala nagireddy
Pawan Kalyan
minister
  • Loading...

More Telugu News