Hyderabad: మహిళ స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ.. నిందితుడికి ఏడాది జైలు
- హైదరాబాద్‌లోని చింతల్‌లో ఘటన
- ఐదేళ్ల నాటి కేసులో తాజాగా తుది తీర్పు
- జైలు శిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధించిన కోర్టు
మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వ్యక్తికి ఐదేళ్ల తర్వాత శిక్ష పడింది. నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు ఏడాది జైలు శిక్షతోపాటు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. హైదరాబాద్‌లోని చింతల్‌లో 19 ఏప్రిల్ 2014లో ఈ ఘటన జరిగింది. బాలానగర్ పోలీసుల కథనం ప్రకారం..
చింతల్‌కు చెందిన మహిళ బాత్రూంలో స్నానం చేస్తుండగా అవినాశ్ రెడ్డి అనే వ్యక్తి దొంగచాటుగా తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఐదేళ్ల తర్వాత ఈ కేసులో గురువారం తుదితీర్పు వచ్చింది. నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అంతేకాదు, పది వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది.