Gali janardhan reddy: బళ్లారి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన గాలి జనార్దనరెడ్డి

  • అక్రమ మైనింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించిన గాలి
  • బళ్లారి వెళ్లకుండా ఆంక్షలు
  • ఐసీయూలో ఉన్న మామయ్యను చూసేందుకు వెళ్లాలంటూ పిటిషన్

అక్రమ మైనింగ్ ఆరోపణలతో మూడేళ్లకుపైగా జైలు శిక్ష అనుభవించిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ప్రస్తుతం షరతులతో కూడిన బెయిలుపై ఉన్నారు. బళ్లారితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాల్లోకి ప్రవేశించరాదన్న ఆంక్షలు ఆయనపై ఉన్నాయి. అయితే, అనారోగ్యంతో బాధపడుతూ ఐసీయూలో ఉన్న తన మామయ్యను చూసేందుకు బళ్లారి వెళ్లాల్సి ఉందని, అందుకు తనను అనుమతించాల్సిందిగా కోరుతూ జనార్దనరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు నేడు విచారణ చేపట్టనుంది.   

Gali janardhan reddy
Obulapuram
Karnataka
bellary
  • Loading...

More Telugu News