Jagan: ప్రాజెక్టులపై జిల్లాల వారీగా కమిటీలు: జగన్

  • గోదావరి జలాల విషయమై నివేదిక ఇవ్వాలి
  • ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచేశారన్న జగన్ 
  • డీజిల్ కోసం రూ.50 కోట్లు విడుదల

నేడు ఏపీ సీఎం జగన్ ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సముద్రంలో కలిసే గోదావరి జలాల విషయమై మరోమారు విస్తృతస్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు. ఎగువ పెన్నా, బైరవానితిప్ప ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచేశారని అన్నారు. ప్రాజెక్టుల వ్యయాన్ని తగ్గించి డీపీఆర్ రూపొందిస్తే అవార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

ప్రాజెక్టులపై జిల్లాల వారీగా కమిటీలు వేయనున్నారు. ఒక్కో జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇంజినీరింగ్ అధికారులతో కమిటీ వేయనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టు సంస్థకు డీజిల్ కోసం జగన్ రూ.50 కోట్లు విడుదల చేశారు.  

Jagan
Polavaram
Biravanitippa
Penna
Godavari
Desel
  • Loading...

More Telugu News