Telangana: తెలంగాణ ఇంటర్ బోర్డుపై మళ్లీ విమర్శలు.. రీ వెరిఫికేషన్ ఫలితాల గణాంకాల్లోను గందరగోళం!

  • 1137 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు గతంలో ప్రకటన
  • 1150 మంది ఉత్తీర్ణులైనట్టు ఈ నెల 4న తెలిపింది
  • 1183 మంది ఉత్తీర్ణులయ్యారని నేడు హైకోర్టులో వెల్లడి

తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డుపై మరోమారు విమర్శలు వెల్లువెత్తాయి. రీ వెరిఫికేషన్ ఫలితాల గణాంకాలు తప్పుల తడకగా వున్నాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. రీ వెరిఫికేషన్ లో 1137 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు గత నెల 27న ఇంటర్ బోర్డు ప్రకటించింది. అదే బోర్డు, ఈ నెల 4న 1150 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టుగా పేర్కొంది. 1183 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఈ రోజున హైకోర్టుకు ఇంటర్ బోర్డు తెలపడం గమనార్హం. ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంబంధించి పొంతన లేని ప్రకటనలు చేస్తున్న ఇంటర్ బోర్డు తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News