Karthik Prasad: ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్ ప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు

  • కార్తీక్‌పై ఫిర్యాదు చేసిన శ్వేత
  • ‘హిప్పీ’ చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన కార్తీక్
  • జాతీయ గీతం వస్తుండగా లేచి నిలబడని కార్తీక్

ప్రముఖ నటుడు దివంగత ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్ ప్రసాద్‌పై హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను తీవ్ర పదజాలంతో కార్తీక్ దూషించాడంటూ శ్వేతా హర్ష అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేడు ‘హిప్పీ’ అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసేందుకు కార్తీక్ ప్రసాద్, ఆర్కే సినీ ప్లెక్స్ పీవీఆర్‌కు వెళ్లారు. అయితే సినిమాకు ముందు జాతీయ గీతం వస్తుండగా అందరూ లేచి నిలబడగా కార్తీక్ మాత్రం సీటులోనే కూర్చుండిపోయారు. ఆయన పక్కనే ఉన్న శ్వేత అదేమని ప్రశ్నించగా, తనను తీవ్ర పదజాలంతో దూషించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

Karthik Prasad
Ahuthi Prasad
Banjara Hills
Hippi
National Anthem
Police
  • Loading...

More Telugu News