West Bengal: సీఎం మమతా బెనర్జీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ!

  • 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
  • ఈ ఎన్నికల్లో మళ్లీ గెలవాలన్న పట్టుదలతో మమత 
  • ఎన్నికల వ్యూహకర్తగా పీకేను నియమించుకునే యోచన

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) భేటీ అయ్యారు. పీకేను ఎన్నికల వ్యూహకర్తగా మమతా బెనర్జీ నియమించుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి మమత ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మమతను పీకే కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రశాంత్ కిశోర్ కు చెందిన ‘ఐ ప్యాక్’ సేవలను వినియోగించుకోవాలని ఆమె చూస్తున్నట్టు సమాచారం. కాగా, ఏపీలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పని చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని అందుకుంది.

West Bengal
cm
Mamata Banerjee
prashant kishore
  • Loading...

More Telugu News