Telangana: తెలంగాణ అసెంబ్లీ వద్ద కాంగ్రెస్ నేతల అరెస్టు

  • సీఎల్పీ విలీనం అప్రజాస్వామికమన్న నేతలు
  • గాంధీ విగ్రహం ఎదుట నిరసన దీక్ష 
  • వీహెచ్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తల అరెస్టు

  టీ-కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ విలీనం కోరుతూ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం ఎదుట నిరసన దీక్షను కొనసాగించారు. సీఎల్పీని విలీనం చేయాలని కోరడం అప్రజాస్వామికమని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్, శ్రీధర్ బాబు విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినదించారు. అసెంబ్లీ ముందు రోడ్డుపై బైఠాయించిన వీహెచ్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News