Secunderabad: సీఎం కేసీఆర్ కు లేఖ రాసి.. తన ముగ్గురు పిల్లలతో పాటు అదృశ్యమైన తండ్రి!

  • సికింద్రాబాద్ లోని తార్నాకలో ఘటన
  • వీఏఓ, వీఆర్వోలు ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణ
  • తాము చనిపోతే వాళ్లిద్దరే కారణమని ఆరోపిస్తూ సీఎంకు లేఖ 

సికింద్రాబాద్ లోని తార్నాకలో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. తార్నాక నివాసి మల్లారెడ్డి తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమయ్యాడు. వారసత్వంగా వచ్చే భూమిని తన పేరు మీదకు మార్చాలని దరఖాస్తు చేసుకుంటే వీఏఓ, వీఆర్వో లు తనను ఇబ్బందులకు గురి చేశారని మల్లారెడ్డి ఆరోపించారు. ఒకవేళ తాను, తన పిల్లలు చనిపోతే అందుకు వీఏఓ, వీఆర్వోలే కారణమని ఆరోపిస్తూ ఈ మేరకు సీఎం కేసీఆర్ కు మల్లారెడ్డి ఓ లేఖ రాసినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Secunderabad
Tarnaka
Malla reddy
VAO
VRO
  • Loading...

More Telugu News