vijayanagaram: ఎమ్మెల్సీ పదవికి కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా

  • విజయనగరం వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కోలగట్ల 
  • ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీకి రాజీనామా
  • కోలగట్ల రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్

వైసీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి తన పదవికి రాజీనామా చేశారు. మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను సమర్పించగా, ఆయన ఆమోదించారు. కాగా, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కోలగట్ల ఇటీవలే గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మీసాల గీత చేతిలో కోలగట్ల ఓటమి పాలయ్యారు. దాంతో ఆయనను ఎమ్మెల్సీని చేసి శాసనమండలికి పంపడం జరిగింది.

vijayanagaram
YSRCP
kolagatla
veera
bhadra
  • Loading...

More Telugu News