Andhra Pradesh: ఫిలింఛాంబర్ లో రామానాయుడి విగ్రహం ఏర్పాటు!

- నేడు రామానాయుడు జయంతి
- విగ్రహాన్ని ఆవిష్కరించిన నిర్మాత సురేష్ బాబు
- కార్యక్రమానికి హాజరైన రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్, పరుచూరి
మూవీ మొఘల్ రామానాయుడు జయంతిని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాన్ని ప్రముఖ నిర్మాత, రామానాయుడు కుమారుడు సురేష్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, జి.ఆదిశేషగిరి రావు, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
