Telugudesam: టీడీపీలో లుకలుకలు.. చంద్రబాబుతో మరోసారి సమావేశమైన గల్లా జయదేవ్!

  • లోక్ సభ విప్ పదవిపై నాని అనాసక్తి
  • గల్లాకు కీలక పదవికి అసంతృప్తిగా ఉన్నారని వార్తలు
  • పదవి వదులుకునేందుకు సిద్ధమైన గల్లా

విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు టీడీపీలో ఇప్పట్లో చల్లారేలా లేదు. కృష్ణా జిల్లా టీడీపీలో ఉమ జోక్యాన్ని నిరసిస్తూ టీడీపీ లోక్ సభ విప్ పదవిని నాని తిరస్కరించారు. ఈ విషయంలో చంద్రబాబు స్వయంగా ఇంటికి పిలిపించుకుని మాట్లాడినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు.

ఈ నేపథ్యంలో గుంటూరు లోక్ సభ సభ్యుడు, టీడీపీ నేత గల్లా జయదేవ్ పార్టీ అధినేత చంద్రబాబుతో ఈరోజు మరోసారి సమావేశం అయ్యారు. తనకు ఎలాంటి బాధ్యతలు లేకపోయినా ఫరవాలేదని చంద్రబాబుకు గల్లా చెప్పారు. తనకు పార్లమెంటరీ పార్టీ నేత పదవిని అప్పగించడంపై నాని అలిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ పదవిని వదులుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు గల్లా జయదేవ్ తెలిపారు. 

Telugudesam
Andhra Pradesh
Chandrababu
galla
nani
Kesineni Nani
  • Loading...

More Telugu News