Telangana: తెలంగాణ స్పీకర్ కు సీఎల్పీ విలీన లేఖ సమర్పణ

  • స్పీకర్ ను కలిసిన పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీ విలీనం చేశాం: రేగా
  • మా నిర్ణయాన్ని ప్రజలు కూడా ఆమోదించారు: గండ్ర

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎల్పీ విలీన లేఖను అందజేశారు. స్పీకర్ ను పన్నెండు మంది ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, వనమా వెంకటేశ్వరరావు, గండ్ర వెంకట రమణారెడ్డి, చిరుమర్తి లింగయ్య, సురేందర్, పైలట్ రోహిత్ రెడ్డి కలిశారు.

స్పీకర్ ను కలిసిన అనంతరం మీడియాతో రేగా కాంతారావు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీ విలీనం కోరామని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. గండ్ర వెంకట రమణ మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి ఈ పన్నెండు మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, తమ నిర్ణయాన్ని ప్రజలు కూడా సంపూర్ణంగా ఆమోదించారని అన్నారు

Telangana
assembly speaker
Pocharam Srinivas
  • Loading...

More Telugu News