Andhra Pradesh: చంద్రబాబు ఏపీలో మమ్మల్ని ముంచేశారు.. ఆయన కారణంగానే మేం ఓడిపోయాం!: బీజేపీ నేత రామ్ మాధవ్

  • ప్రత్యేక హోదాపై బాబు దుష్ప్రచారం
  • ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ నష్టపోయాం
  • టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ మాధవ్

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, ప్రధాని మోదీపై టీడీపీ అధినేత చంద్రబాబు చాలా దుష్ప్రచారం చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ విమర్శించారు. ఈ విషయంలో తమను టార్గెట్ చేయడం వల్లే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో తెలంగాణలోనూ బీజేపీ నష్టపోయిందని విశ్లేషించారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా తాము గెలిచిన నాలుగు సీట్లలో సెటిలర్లు ఎవరూ బీజేపీకి ఓటేయలేదని గుర్తుచేశారు. ఓ టీవీ ఛానల్ కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ మాధవ్ పలు అంశాలపై మాట్లాడారు.

తెలంగాణలో ఉన్న సెటిలర్లు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుకున్నారనీ, అది ఇవ్వకపోవడంతోనే ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయని విశ్లేషించారు. ఆంధ్రాలో పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని రామ్ మాధవ్ చెప్పారు. ఏపీతో పాటు బిహార్ కూడా ప్రత్యేకహోదాను కోరుతోందని గుర్తుచేశారు. ప్రజాబలమున్న నేతలను చేర్చుకుని వైసీపీకి దీటుగా నిలుస్తామని చెప్పారు. వైసీపీ చేసే మంచి పనులకు కేంద్రం తన సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Telangana
Chandrababu
BJP
Congress
rammadhav
  • Loading...

More Telugu News